సీపీఐ(ఎం) 24వ మహాసభల లోగో ఆవిష్కరణ

మదురై: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) 24వ అఖిల భారత మహాసభలు 2025, ఏప్రిల్‌ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మదురైలో జరగనున్నాయి. ఈ సందర్భంగా మధురైలోని తిక్కతిర్‌ హాలులో గురువారం అఖిల భారత మహాసభల లోగోని కేంద్ర కమిటీ సభ్యురాలు యు.వాసుకి ఆవిష్కరించారు. ఈ సమావేశానికి తమిళనాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం అధ్యక్షత వహించారు. ఆహ్వాన సంఘం కార్యదర్శి, ఎంపీ సు.వెంకటేశన్‌ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యుడు, ఆహ్వాన కమిటీ చైర్మెన్‌ కె.బాలకృష్ణన్‌ ఆహ్వాన కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ మేరకు తమిళ, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా లోగోలను రూపొందించారు.