
క్రిష్ణా మండల తహశీల్దార్‌గా బి వెంకటేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా ఆర్డీవో కార్యాలయంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల జిల్లా అంతర్గత బదిలీల్లో భాగంగా శుక్రవారం క్రిష్ణా తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ దయాకర్ రెడ్డి నూతన తహసీల్దార్ బి వెంకటేష్ కు బాధ్యతలు అప్పగించి, దామరగిద్దకు బదిలిపై వెళ్లారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు నూతన తహసీల్దార్ కు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కులం ఆదాయ ధ్రువ పత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేసి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది తో సమావేశమయ్యారు. సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు, నాయకులు సోమశేఖర్ గౌడ్, నల్లె నర్శప్ప, ఉసెనప్ప, దండు రాఘవేంద్ర, శక్తి సింగ్, శాంక్రప్ప తదితర నాయకులు పాల్గొని నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపారు.