నవతెలంగాణ – తొగుట
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండల పర్యటనను విజయవంతం చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం మధ్యాహ్నం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి దుబ్బాక ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నారని చెప్పా రు. కర్యక్రమానికి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్, విద్యార్ధి, బూత్, సోషల్ మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.