నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గురువారం రాత్రి దర్గా గంధం ఊరేగింపు నిర్వహించారు. మాజీ వాడు సభ్యులు కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ తన సొంత నిధులతో సుమారుగా 1000 వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పిఎసిఎస్ డైరెక్టర్ యేమాల ఏలేందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కోల లింగం గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, మాజీ కోఆప్షన్ యాకూబ్ గజం లచ్చి నర్సు, కళ్లెం బాబు రావు గౌడు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుంచు సంజీవ తదితరులు పాల్గొన్నారు.