పథకాల సర్వేలను పకడ్బందీగా చేపట్టాలి

నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి మండలంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ అత్మియభారోసా సర్వేపై, మైలారం రిజర్వాయర్ జలాశయంలో భూములు కోల్పోయిన రైతుల వివరాలను పకడ్బందీగా చేపట్టాలని ఆర్అండ్ఆర్ కమిషనర్, వరంగల్ ఉమ్మడి జిల్లా లా.ఐ. డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఐఏఎస్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో సర్వేన క్షేత్రస్థాయిలో చేపట్టాలన్నారు. ఆయనతోపాటు తహసీల్దార్ ఎం శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిఓ ప్రకాష్, ఏపీఓ కుమార్, ఆర్ఐ చంద్రమోహన్ సర్వేయర్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.