సీపీఐ(ఎం)రాష్ట్ర మహాసభలను విజవంతం చేయండి

– సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సీపీఐ(ఎం)రాష్ట్ర మహాసభలను విజవంతం చేయాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ శుక్రవారం పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో సీపీఐ(ఎం)పార్టీ జెండాను శ్రీనివాస్ ఆవిష్కరించారు. బడుగు,బలహీన,అణగారిన వర్గాల హక్కులపై పోరాడే పార్టీ సీపీఐ(ఎం)పార్టీయేనని శ్రీనివాస్ అన్నారు.మహాసభలకు ముఖ్యఅతిథులుగా సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్,కేరళ సీఎం పినరయి విజయన్,బీవీ రాఘవులు,తమ్మినేని వీరబద్రం తదితరులు హాజరువుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ(ఎం)నాయకులు ఎల్లయ్య,లింగం,సత్తయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.