
పోలీసులకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ ఎస్సై ను శాలువాతో సన్మానించారు. శాంతి భద్రతల కొరకు పోలీసులకు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.