
రైతు భరోసా సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని గుర్జకుంట గ్రామంలో రైతు భరోసా సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను గుర్తించాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకోని సర్వే నిర్వహించాలని సూచించారు. అలాగే గ్రామంలో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో 100% వ్యవసాయ భూములు మాత్రమే ఉన్నాయని అధికారులకు తెలియజేశారు. ఈ పరిశీలనలో అడిషనల్ కలెక్టర్ వెంట ఎమ్మార్వో శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రజిత, వ్యవసాయ అధికారి శోభ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, ఏఈఓ వినోద్, రెవెన్యూ, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.