ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవీ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం జన్నారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ మేకల అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్డు ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్ సొసైటీ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందించామన్నారు. కార్యక్రమంలో జన్నారం మండల మాల మహానాడు సెక్రెటరీ కోడి హరీష్, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ లక్ష్మీ, సిబ్బంది క్రిష్ణవేణి, విజయలక్ష్మి, రాధిక తదితరులతో పాటు రోగుల సహాయకులు పాల్గొన్నారు.