ట్రాఫిక్ నింబంధనలు పాటించాలి.. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

నవతెలంగాణ-వీణవంక
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం ఆటో డ్రైవర్లు, యువకులతో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనాలు జాగ్రత్తగా నడపాలన్నారు. చిన్నచిన్న పొరపాట్లతో జీవితాలు నాశనమవుతాయని, అలాంటి పొరపాట్లు చేసి కేసుల పాలు కవొద్దని చెప్పారు. అనంతరం గ్రామాల్లోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక ఎస్సై శేఖర్, యువకులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.