– సుందరీకరణకు ప్రణాళిక..
నవతెలంగాణ – అశ్వారావుపేట
దొంతికుంట చెరువు సుందరీకరణ కు కృషి చేస్తాం అని, అందుకోసం ప్రణాళికలు రూపొందించారని నీటిపారుదల శాఖ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలు ఇచ్చారు. శనివారం ఆయన నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా దొంతికుంట చెరువు పరిసరాలు పూర్తిగా పరిశీలించి త్వరలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు కేటాయించి అన్ని హంగులతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ గా మారిన తరుణంలో దొంతికుంట చెరువును అందంగా తీర్చిదిద్ది మండల ప్రజలకు కానుకగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు, సుంకవల్లి వీరభద్ర రావు, జూపల్లి రమేష్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.