అవ్వాలి టైగర్ జోన్ పరిధిలో కలప అక్రమ నిలువ ఉంచిన రవాణా చేసిన టైగర్ జోన్ నిబంధనలు మేరకు కఠిన చర్యలు తప్పవని ఇంధన్ పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ అన్నారు. ఇందన్ పెళ్లి రేంజ్ కార్యాలయం పరిధిలోని హాస్టల్ తండా నాయక గుడా గ్రామాలలో శనివారం ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామాలకు చెందిన కొంతమంది అక్రమంగా కలప రవాణా చేస్తూ ఇందులో నిల్వ ఉంచుకుంటున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేశామన్నారు. ఎఫ్ ఎస్ ఓ లు రవి, హనుమంతరావు ముసిపుద్దిన్ రూబీ నా తదితరులు పాల్గొన్నారు.