ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2004 ఏఆర్ బ్యాచ్ కి చెందిన అక్తర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ (ఏఆర్ హెచ్.సి) సంజయ్ నగర్ ఆదిలాబాద్ లో స్థిరపడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం 317 జీవో కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తు జనవరి 2న అనారోగ్య కారణంగా మృతిచెందారు. వారి కుటుంబానికి ఆర్థిక చేయుత ఇవ్వడానికి ఉమ్మడి జిల్లాకు చెందిన 2004 సివిల్ అండ్ ఏఆర్ బ్యాచ్ ఆర్థికంగా ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. అందులో భార్య పిల్లలకు 1,50,000 ఆర్థిక చేయూతనందించారు. అలాగే అక్తర్ వాళ్ళ తల్లిదండ్రులకు రూ.50వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి 2004 బ్యాచ్ తరపున, ఆర్ఐ డి వెంకట్, కిషోర్, ప్రవీణ్, అజయ్, రాందాస్, ప్రకాష్, విజయ్, రాజేశ్వర్, ధనరాజ్, సతీష్, కైలాష్ 2004 బ్యాచ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభ్యులు ఉన్నారు.