వలస జీవుల రక్తంతో
ఏ దేశం నుదుట తిలకం దిద్దేది
రైలు పట్టాలు పేదల రక్తాన్ని
తాగుతుంటే
ఊరు చేరక ముందే
ప్రాణాలు గాలిలో కల్సిపోతుంటే
కాలి నడకలే కొత్త భారతాన్ని
రాస్తుంటే
రాలుతున్న మొగ్గలతో
ఏ దేశం చెట్టు పూలు పూసేను
పసిప్రాయం పిడికిట జారిన
ఇసుక ఐపోయెను
పండు ముసలి కొడుకు కోసం
ఎదురు చూసి
పంచభూతాలలో కలిసేను
రోడ్లపై కాలుతున్నవి
ఈ దేశం పాదాలే
దప్పిక తీర్చే వారేరి
దేహంలో ఏ దివ్వెలు వెలిగేను
వెలుగులు చిమ్మే దేశం కాదా
వెన్నెల కురిసే అడవేనా
ఆశలు తీరే నెలవేనా
దీనుల గాధలు ప్రభువులు వినలేరా
ఏ పాదాలను కడగాలి
ఏ ప్రమిదలు వెలగాలి
– సుంకర రమేశ్,
9492180764