సర్వే 2024 ప్రకారం 18234 కుటుంబాలు..

According to survey 2024 18234 families..– ప్రస్తుతం వినియోగంలో ఉన్న రేషన్ కార్డ్ లు 17521…

– సర్వేలో కార్డ్ కు వచ్చిన దరఖాస్తులు 1781…
– ఎనిమిదేళ్ళ కు కొత్త కార్డులకు జారీకి సన్నహాలు
– వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న పేదలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
పౌరుడి కి ఆధార్ ఎంత కీలకం మో నేడు పేదవాడికి అంతకంటే ప్రధాన ఆధారం రేషన్ కార్డు అనే చెప్పుకోవచ్చు.దేశంలో ప్రతీ పౌరుడు దారిద్రరేఖ ఎగువ లేక దిగువ అని నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జారీ చేసే ఈ రేషన్ కార్డే, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కళ్యాణ లక్ష్మి మొదలుకొని కానుపు,అనంతరం పిల్లలు చదువు,పెద్దలు ఆరోగ్యం అవసరం అయిన ఏ రాయితీ పొందాలన్న ఈ కార్డే ప్రామాణికం. అందుకే ఈ కార్డు కోసం ప్రతీ పేద ఎదురు చూస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్డులు కోసం గత ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం కార్డులు ఇవ్వాలని నిర్ణయించడంతో వారు ఎంతో ఆనందంతో ఉన్నారు. మండలంలో 2011 జనాభా గణన ప్రకారం నాడు 16 పంచాయితీల్లో మొత్తం 15906 కుటుంబాలు ఉన్నాయి. 2016 లో నాటి ప్రభుత్వం జారీ చేసిన లెక్కల ప్రకారం నేడు అమలులో ఉన్న మొత్తం 17,521 కార్డులు వినియోగం లో ఉన్నవి. 2024 కుటుంబ సమగ్ర గణన ప్రకారం 30 పంచాయితీలలో మొత్తం 18,234 కుటుంబాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ సర్వే లోనే 1781 కుటుంబాలు తమకు రేషన్ కార్డ్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను రెవిన్యూ,పంచాయితీ రాజ్ శాఖలు స్థానిక సిబ్బంది చే మండల స్థాయి అధికారులు తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎం.పీ.డీ.ఓ ప్రవీణ్ కుమార్ లు అర్హతలను అంచనా వేస్తున్నారు.