నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ల పల్లి మండలములోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో స్వీపర్ కమ్ స్కావేంజర్ పోస్ట్ కు, అసిస్టెంట్ కుక్కు గా పని చేయుటకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఈఓ భూక్యా రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వీపర్ కం స్కావెంజర్ పోస్ట్ 01, అసిస్టెంట్ కుక్ పోస్ట్ 01. ఈ రెండు పోస్టులకు అర్హత 7వ తరగతి పాసై ఉండాలి. ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.ఆసక్తిగల మహిళా అభ్యర్థులు. 19 తేదీ నుండి 21 తేదీ మంగళ వారం లోపు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయం లో దరఖాస్తులు సమర్పించ గలరని మండల విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.