మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. విద్యార్థి దశ నుండి ఇప్పటివరకు స్థిరపడిన విధానము కుటుంబ నేపథ్యము తదితర అంశాలను ఒకరినొకరు చెప్పుకున్నారు. పూర్వ విద్యార్థులు తమకు విద్యా బోధనలు నేర్పిన గురువులు శ్రీనివాసరావు, వీరయ్య, వెంకటరెడ్డి, మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులు, సోమారెడ్డి, మరియు అటెండర్లు రామదాసు, షరీఫ్, వెంకటయ్య లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన గుత్తికొండప్రసాద్, పాలడుగు కిషోర్, పల్లేపాటి సమ్మిరెడ్డిను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అనగం సురేష్, పాడియా గాంగు, రంజాన్, గార్ల ను అభినందించారు. పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.