కార్మికుల సమస్యలపై సీఐటీయూ సమరశీల పోరాటాలు: జీ.భాస్కర్

CITU's active struggles on workers' issues: G. Bhaskarనవతెలంగాణ -దుబ్బాక 
కార్మికుల హక్కులు వారి సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ అన్నారు.సిద్దిపేట ఉద్యమ కేంద్రంగా జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు,కర్షకుల కొరకు సీఐటీయూ అనేక పోరాటాలు నిర్వహించిదని గుర్తు చేశారు.ఈనెల 20 న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న ‘జిల్లా ప్రజా సంఘాల కార్యాలయం (కార్మిక కర్షక భవన్)’ ప్రారంభోత్సవానికి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు,కర్షకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.వివిధ రంగాల కార్మికులు,శ్రేయోభిలాషుల సహాయ సహకారాలతో జిల్లా కేంద్రంలో ‘కార్మిక కర్షక భవన్’ ను నిర్మించుకోవడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని కార్మిక,కర్షకులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.