మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి: మచ్చ శ్రీనివాస్ 

Action should be taken against those who obstructed minister's convoy: Maccha Srinivasనవతెలంగాణ- దుబ్బాక 
ఇటీవలే దుబ్బాక పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర అటవీ,దేవాదాయ శాఖ మంత్రి,ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కాన్వాయి ని అడ్డుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అడ్డుపడిన బీఆర్ఎస్ నాయకులను నిలువరించాల్సిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి.. దుబ్బాక సీఐ ను దూషించడం బాధాకరమన్నారు.మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సురేష్,కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు బురాని శ్రీకాంత్,సోషల్ మీడియా నాయకులు కర్ణంపల్లి రమేష్ గౌడ్,అనంతుల స్వామి,మాడుగుల ఎల్లం,ఆకుల భరత్,మంద శ్రీనివాస్,సత్తు శ్రీనివాస్ రెడ్డి,ఐరేని సాయితేజ గౌడ్,దేవుని రాజు,ఎండీ.సలీముద్దీన్ పలువురున్నారు.