పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట మండలంలోని బసవన్నపల్లి, ఆర్గొండా గ్రామాల శివారులో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్ లు, 58 వేల 350 రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. మండలంలో అక్రమంగా పేకాట ఆడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.