నేను పెన్ను పెట్టుకున్నన్ని రోజులూ
నా జేబుకి ఓ వెన్నెముక ఉండేది
క్రమంగా నేను
జేబులో డబ్బులు దోపుకోవటం చూసి
నా పెన్ను
తన పత్తీ (పాళీ), బుర్రా (క్యాప్) కొట్టుకొని
వద్దని మొత్తుకోవటం మొదలెట్టింది
నేనసలు విని బతికితే కదా!
పర్యవసానం…
ఇప్పుడు నా జేబుకి వెన్నునొప్పి వచ్చింది
పెన్ను పెయిన్‌తో రాయటమే లేదు
– నలిమెల భాస్కర్