వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆద్వర్యంలో ఒకేషనల్ ఎక్స్ లెన్సీ అవార్డులను ప్రధానం చేశారు. నిజామాబాదు నగరంలోని ఒక హోటల్ లో ఆదివారం రాత్రి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో పచ్చదనం పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న రిటైర్ద్ మిలిటరీమెన్ అశోక్,ఆవులు, పక్షులకు నీరు ఆహారాన్ని అందజేస్తున్న పాత్రికేయుడు సిరిగాద ప్రసాద్,అంధుల కోసం ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసిన ఆదిలాబాదుకు చెందిన రవికిరణ్ లకు రోటరీ క్లబ్ గవర్నర్ గట్టు జ్ఞానప్రకాష్ అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గట్టు జ్ఞానప్రకాష్, డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్,రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అద్యక్షులు పద్మ శ్రీనివాస్ కార్యదర్శి గౌరీశంకర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.