పేదలంతా హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి..

All the poor should move together for their rights.– సూడి కృష్ణారెడ్డి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఘనంగా సుందరయ్య నగర్ 3వ వార్షికోత్సవం పేదలు ఇండ్ల స్థలాల కోసం ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పసర గ్రామంలోని  సుందరయ్య నగర్ లో మూడవ వార్షికోత్సవ సభ కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ.. సుందరయ్య నగర్ లో మూడవ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. పేదలందరూ పట్టాలు సాధించేంతవరకు పోరాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మూడవ సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి సుందరయ్య నగర్ వాసులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి గ్రామపంచాయతీ ముందు ఆందోళన చేశారు. కాలనీలో ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరి ఇంటిని గ్రామపంచాయతీలో నమోదు చేసి ఇంటి నెంబర్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి పొదిల్ల చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి మండల కమిటీ నాయకులు అంబాల మురళి, ఉపేంద్ర చారి, సూర్యనారాయణ, సప్పిడి ఆదిరెడ్డి జిట్టబోయిన రమేష్, కందుల రాజేశ్వరి, మంచాల కవిత, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కారం రజిత, గ్రామ కమిటీ నాయకులు వల్లపు రాజు, మచ్చ సువర్ణ ,సంకినేని రాజేశ్వరి, గండు రాంబాబు, సామ సమ్మక్క,   శ్రీరామోజు సువర్ణ ,ఆంజనేయులు, సులోచన, శారద, ఎండి సిరాజ్, ఇలియాస్, తదితరులు పాల్గొన్నారు.