నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు కొరకు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందని ఉదయం 10 గంటలకు గ్రామ సభ నిర్వహించి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారు గ్రామ సభకు హాజరై దరఖాస్తులు అందజేయాలని సూచించారు.