ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి

– సింగపూర్‌ బోనాలకు మంత్రులకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఖండాంతరాలు దాటిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక శాఖల మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మెన్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. సింగపూర్‌ పర్యటనలో తెలంగాణ సింగపూర్‌ కల్చరల్‌ సొసైటీ ప్రతినిదులు మర్యాద పూర్వకంగా కలసి సింగపూర్‌లో నిర్వహించనున్న లష్కర్‌ బోనాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వలస వచ్చిన తమ సంస్కతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్న సింగపూర్‌లోని తెలంగాణ ప్రజలను, అందుకు కషి చేస్తున్న సింగపూర్‌ తెలుగు కల్చరల్‌ సొసైటీ ప్రతినిధులను అభినందించారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివద్ధి సాధించడానికి గర్వపడుతున్నామని సింగపూరు కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గతంలోనే ఏర్పడి ఉంటే తమ భవిష్యత్తు ఎంతో బాగుండేదని, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాలకు వచ్చేవారం కాదని వారు మంత్రికి తెలిపారు. సింగపూర్‌ లోని తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న లష్కర్‌ బోనాలకు వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట ప్రభుత్వం సాంస్కతిక శాఖ నుంచి కళాకారులను పంపిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఖండాలు దాటినా తమ సంస్కతిని ఆచార వ్యవహారాలను కొనసాగించడాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ ఎండీ మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.
మూడు కార్పొరేషన్లకు చైర్మెన్ల నియామకం
తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌గా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్‌యాదవ్‌, నారాయణ్‌ పేట్‌ జిల్లా మద్దూర్‌ మండలం రెనెవట్లకు చెందిన మొహమ్మద్‌ సలీంలను నియమించారు. తెలంగాణ స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మార్వెల్లికి చెందిన మాటం బిక్షపతిని నియమించారు. తెలంగాణ స్టేట్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ తన్వీర్‌ను నియమించారు .