ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం, పంబాపురం, కామారం, అంకంపల్లి గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. పంభాపూర్ లో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. నాలుగు పథకాల లబ్ధిదారుల జాబితా చదివి వినిపించారు. జాబితాలో కొందరు పేర్లు చేర్చలేదని స్థానికులు ఆరోపించగా జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ప్రజా పాలన కేంద్రాలలో అప్లై చేసుకోవాలని తెలిపారు. ప్రతి పేదవారికి పథకాలు అందేలా కృషి జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఏపీవో అనిల్, ఎపిఓ శ్రీధర్ రావు, ఏపీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ గ్రామాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.