కాలేయ రక్షణకు ముందు జాగ్రత్తలు అవసరం..

Liver protection requires precautions.నవతెలంగాణ – కంఠేశ్వర్ 

మధుమేహ వ్యాదిగ్రస్తులు, ఉబకాయం, ఆల్కహాల్ సేవించేవారి కాలేయo అపాయంలో ఉన్నట్టు గ్రహించాలని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జైనీ నెహ్రు అన్నారు. ముందు జాగ్రత్తతో కాలేయ వ్యాధి నుండి బయట పడవచ్చు అని ఆమె అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వ్యాధి నిర్ధారణ పరీక్ష మరియు మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు.గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లు డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి ,డాక్టర్ రాహుల్ సామల, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి క్యాంపును నిర్వహించారు. 6 వేల రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ పరీక్షను ఉచితంగా నిర్వహించారు. అధిక కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్ ,కాలేయ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి వారికి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. మందులు పంపిణీ చేయడం జరిగింది. క్యాన్సర్,లివర్, కిడ్నీ, లంగ్స్ సమస్యలు బాగా ముదిరిన తర్వాతనే వైద్యం తీసుకుంటున్నారని , ఇది ప్రమాద సంకేతానికి నిదర్శనమని ముందుగా పరీక్షలు నిర్వహించుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, పేద, మధ్యతరగతి ప్రజలు వీటిని వినియోగించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తెలిపారు.ఈ హెల్త్ క్యాంపులో పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్మోహన్ ,జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ ,ప్రసాద్ రావు, శిర్ప హనుమాన్లు , లావు వీరయ్య, రాధా కిషన్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, జార్జ్, శంకర్ ,అద్దంకి హుషాన్ శ్రీమతి బేబీ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 200 మంది ఈ క్యాంపులో పాల్గొన్నారు.