నవతెలంగాణ – తాడ్వాయి
ఉపాధి హామీ పనులతో సంబంధం లేకుండా భూమిలేని పేదలందరికీ రూ.12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ వర్తింపజేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అష్ట ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ పేదలందరికీ అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఉపాధి హామీతో సంబంధం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, మంజూరు చేయాలని కోరారు. వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెంచిన పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలన్నారు. మహిళలకు ఇచ్చే పథకాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షేమ పథకాలు నిరంతర ప్రత్యేకంగా చేయాలని తెలిపారు.