
మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం నుండి గ్రామసభలు అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బస్వాపూర్ , చిన్న ఏడిగి గ్రామాలలో గ్రామ సభలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ సభలు గ్రామాలలో నెలకొన్న సమస్యలను , ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు గుర్తించేందుకు, అదేవిధంగా అనర్హులను తొలగించేందుకు ఈ గ్రామసభలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని గ్రామ సభలో పాల్గొన్న అధికారులు అన్నారు. అందుకే గ్రామసభలు ఏర్పాటు చేశారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగ ప్రతి ఒక్క నిరుపేదలక న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానమని గ్రామ సభలలో అధికారులు ప్రజలకు పేర్కొన్నారు అదేవిధంగా పథకాలు అందని వారు గ్రామసభలలో తమ తమ ఫిర్యాదులు అందజేయాలని వారికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినప్పుడే సమస్య పరిష్కార దిశగా అధికారులు ముందడుగు వేయగలుగుతారని సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డిఓ జుకర్ తాసిల్దార్ పలు గ్రామాల జిపి సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.