గ్రామ సభల్లో పేర్లు రానివారు ఇపుడు దరఖాస్తులు సమర్పించవచ్చు..

Those whose names did not appear in the village councils can now submit applications.– అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ 
నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామ సభల్లో చదివిన జాబితాలో పేర్లు రానివారు ఇపుడు దరఖాస్తులు సమర్పించవచ్చని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం కామారెడ్డి మండలం షాబ్దిపూర్, సదాశివనగర్ మండలం తిరుమన్పల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని పేరు రానివారు ప్రస్తుతం ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులు సమార్పించవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అదేవిధంగా లబ్దుచేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామ సభల్లో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, సదాశివనగర్ తహసీల్దార్ గంగా సాగర్, ఆయా మండలాల ఎంపీడీఓ లు, వ్యవసాయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.