హైదరాబాద్ మాల్లో రిపబ్లిక్ డే సేల్ ఉత్సవం

– ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు.. 
నవతెలంగాణ హైదరాబాదు: నెక్సస్ హైదరాబాద్ మాల్లో రిపబ్లిక్ డే సేల్ ఉత్సవం ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో అనేక బ్రాండ్లపై 50 శాతం తగ్గింపు కలదు. ఇది వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ, భారతీయ టాప్ బ్రాండ్లు ఈ సేల్‌లో ఉన్నాయి. ఫ్యాషన్, బ్యూటీ, ఫుట్‌వేర్, ఫుడ్ అండ్ బేవరేజ్ రంగాల్లో 50 పైగా బ్రాండ్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో కలవు. ముఖ్యమైన బ్రాండ్లు.. జారా, సెఫోరా, ఎం&ఎస్, రిలయన్స్ సెంట్రో, ట్రెండ్స్, మ్యాక్స్, వెస్ట్సైడ్ ఉన్నాయి. నెక్సస్ సెలెక్ట్ మాల్స్ నిర్వహిస్తున్న ‘అస్లీ హ్యాపీనెస్ వాలా సేల్’ కు ముగింపుగా ఈ రిపబ్లిక్ డే సేల్ జరుగుతుంది. షాపర్లకు ఉత్తమ విలువ, మరిచిపోలేని షాపింగ్ అనుభవం అందించడానికి ఇది నెక్సస్ సెలెక్ట్ మాల్స్ కృషిలో ఒక భాగంగా చెప్పవచ్చు. అద్భుతమైన డెకరేషన్స్ ఆకట్టుకోనుంది. వినోద కార్యక్రమాలు అలరించనున్నాయి. ప్రత్యేక డీల్స్ తో ఈ రిపబ్లిక్ డే వేడుకలు మరింత ఆనందదాయకంగా ఉండనున్నాయి.