గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం..

నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండల కేంద్రంలో గల అల్ప సంఖ్యాక గురుకుల పాఠశాల, కళాశాలలో 2025- 26 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఐదవ తరగతి నందు 60 మైనారిటీ సీట్లు,20 నాన్ మైనారిటీ సీట్లు కలవు. కావున తల్లిదండ్రులు మీకు తెలిసిన పిల్లలను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఆ పాఠశాల యాజమాన్యం పత్రికా ప్రకటనలో అన్నారు. ఈరోజు నుండి ఉపాధ్యాయులు అడ్మిషన్ల కొరకై వేరు వేరు ఊర్లకు వెళ్తారు కాబట్టి విద్యార్థులకు, దూర ప్రయాణం వదిలేసి ఇక్కడే భీంగల్ లోనే సీట్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని అన్నారు. ఇవే కాకుండా అరవ తరగతి నుండి 8వ తరగతి వరకు కొన్ని మిగిలిపోయిన స్వీట్లు ఉన్నాయని వాటి కొరకు కూడా అప్లై చేసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపిసి కి గాను చెరో 30 మైనారిటీ సీట్లు, చెరో 10 నాన్ మైనారిటీ సీట్లకు అడ్మిషన్లు ప్రారంభమైనవి. కావున విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రక్రియ నందు సహకరించాలని సూచించారు.