పెద్దవంగరను కమ్మేసిన దట్టమైన పొగమంచు..

Dense fog that covered Peddwangara..– పొగమంచు తో వాహనదారులు ఇబ్బందులు 
నవతెలంగాణ – పెద్దవంగర
దట్టమైన పొగ మంచు పెద్దవంగరను కమ్మేయడంతో బుధవారం వాహనదారులు, ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 దాటిన కూడా సూర్యుడు బయటకు రాకపోవడంతో వృద్ధులు అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎదురుగా పది అడుగుల దూరంలో ఉన్నవి కూడా కనిపించినంత గా పొగ మంచు కమ్మేసింది. దీంతో వాహనచోదకులు లైట్లు, ఇండికేటర్లు వేసుకుని మరీ, ప్రయాణం సాగించారు. చెట్ల ఆకులపై, కొమ్మలపై నుంచి మంచు బిందువులు పడ్డట్టుగా రాలాయి. పొగమంచు వేకువజాము నుండే క్రమేణా పెరగడంతో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ప్రయాణంలో వాహనచోదకుల పై పొగమంచు నీటి బిందువులు మీద పడడంతో తడిసిముద్దయ్యారు.