మున్సిపల్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు వెన్ రెడ్డి రాజుకు ఘన సన్మానం…

Municipal Chambers State President Ven Reddy Raju honored...నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు వెన్ రెడ్డి రాజు 6వ వార్డు కౌన్సిలర్ ఆలె నాగరాజు లను బుధవారం పద్మవంశీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు గోశిక రాజేందర్ ఆధ్వర్యంలో శాలువా,మెమొంటో  లతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ పద్మ వంశీ కాలనీని కోటి రూపాయల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేయించానని అన్నారు. కాలనీలో కొంత మిగిలిపోయిన పనులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీనీ మరింత అభివృద్ధి చేస్తానని చైర్మన్ వెన్ రెడ్డి రాజు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ ఆలే నాగరాజు చౌటుప్పల్ మాజీ ఎంపీపీ చిక్క నరసింహ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుగుల వెంకటయ్య,ఆవుల యేసు యాదవ్ పద్మవంశీ కాలనీ గౌరవాధ్యక్షులు బాల ఎల్లయ్య ఉపాధ్యక్షులు ఏలూరి భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి లెంకలపల్లి స్వామి కోశాధికారి యేషాల రామారావు సహాయ కార్యదర్శులు భారత మధు చిట్టెంపల్లి జగన్  కార్యవర్గ సభ్యులు గుండు రమేష్,టాక్ రాజేష్,వనం పెంటయ్య,రుద్ర బాలాజీ తదితరులు పాల్గొన్నారు.