నవతెలంగాణ – తాడ్వాయి
రేపు అనగా గురువారం 22 నాడు మండలంలోని కాటాపూర్ లో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించినట్లు ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా హాజరై సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మర్రి నరేష్ అన్నారు. బుధవారం నవతెలంగాణ తో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై అర్హులైన లబ్ధిదారులకోసం నిర్వహించే గ్రామ సభల్లో గ్రామ అధ్యక్షులతో పాటుగా నాయకులు కార్యకర్తలలు అందుబాటులో ఉండి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామసభలకు వచ్చిన అధికారులకు ప్రజలందరూ సహకరించాలని, ఏమైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎవరు ఆందోళను చెందొద్దనీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి విషయాన్ని భూతద్దంతో చూసి ప్రజలకు ఉపయోగపడే పనులముగా విమర్శించడం సరికాదు అన్నారు.