ఆర్డిటి ఆధ్వర్యంలో స్వశక్తి కరణ శిక్షణ కార్యక్రమం ..

Swashakti karana training program under RDT.. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్..
నవతెలంగాణ – తాడ్వాయి 
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నాయకుల స్వశక్తి కరణ శిక్షణ కార్యక్రమం మండలానికి (తాడ్వాయి) చెందిన 22 గ్రామాల ఆదివాసీ (కోయ) కమ్యూనిటీ గ్రామస్థాయి ఆదివాసీ నాయకులకు శిక్షణ కార్యక్రమం రెండు రోజుల నుండి నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు వారి వారి గ్రామాలకు సంబంధించిన సమస్యలను, వారి వారి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరి ముగింపు రోజున ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీల ఎలాంటి సమస్యలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, డిఎంహెచ్వో గోపాల్ రావు, ఆర్డిటి డైరెక్టర్లు నిరంజన్, సరస్వతి టీం లీడర్లు సంజీవ్, సుబ్రహ్మణ్యం, ట్రైనర్లు నరసింహ, ధనలక్ష్మి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.