మండలంలోని గట్టికల్ గ్రామానికి చెందిన ఇల్లందుల అంబేద్కర్ బురహాన్ పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా కవిత్వాలు, పాటల రచనలలో ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో రచించిన మహిళ ఎటు వైపు, కాలుష్యమే కారుణ్య మరణాలు, అమ్మ నాన్నలది వృథా శ్రమేనా, ఏది అసలైన బాల్యం మొదలైన సామాజిక స్పృహ కలిగిన కవిత్వాలను, పాటలను గుర్తించిన వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ, టీఎన్ఏ రికార్డ్స్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ పట్టణంలోని శ్రీ కౌత పూర్ణనంద్ విలాస్ కళా వేదికలో బుధవారం జరిగిన కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కె ప్రతాప్ యువతేజం జాతీయ ప్రతిభ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాయపర్తి మండలం ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అవార్డు గ్రహీత అంబేద్కర్ కు అభినందనలు తెలిపారు.