విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ..

Distribution of sports clothes to students.నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్, ఏర్గట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ దేవేంధర్ సంయుక్తంగా 50 క్రీడా దుస్తులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు ఆటల్లో, చదువుల్లో గ్రామనికే గాక జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని, తమవంతు సహకారం పాఠశాలకు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు క్రీడా దుస్తువులు అందజేసిన శివన్నోళ్ళ శివకుమార్ ను, దేవేంధర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి, ఉపాధ్యాయుల బృందం సన్మానించారు. కార్యక్రమంలో కో-ఆపరేటివ్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.