ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సహకరించాలి ..

Fee reimbursement should contribute to release of arrears..– ప్రభుత్వ సలహాదారు షబ్బీనలిని కలిసి విన్నవించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు 
నవతెలంగాణ – కంఠేశ్వర్

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు సహకరించాలని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు గురువారం కలిసి కోరారు. షబ్బీర్ అలీ చాలా అనుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర ట్రెజరీ సెక్రెటరీ వినోద్ కి ఫోన్ చేసి సమస్యను తెలుసుకొని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారని తెలిపారు. షబ్బీర్ అలీ కి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు ధన్యవాదాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో గురువేందర్ రెడ్డి, బాలాజి, దత్తు, సత్యం, విజయ్, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.