ప్రాణులకు ప్రమాదాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు ..

Strict action will be taken if it causes danger to life.– ఏ కమలాకర్ ఎస్ ఐ పసర పోలీస్ స్టేషన్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట
పంట పొలాలల్లో, అడవుల్లో కరెంట్ తీగలు అమర్చి మనుషులకు ప్రమాదాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవనీ పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. గురువారం  పసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుస్సాపూర్ మరియు దుంపెల్లిగూడెం గ్రామంలో పంట పొలాల్లో విద్యుత్ వైర్లు అమర్చి అడవిప్రాణులు మనుషుల ప్రాణాలు పోతున్న సందర్భంగా అవగాహన సదాసు  సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ కొందరు తమ పంట పొలాలకు రక్షణ నిమిత్తం మరియు మరి కొంత మంది వన్యప్రాణులను వేటాడుట కొరకు కరెంట్ తీగలు , ఉచ్చులు అమరుస్తున్నారు అని వీటి వాళ్ళ మనుషుల ప్రాణాలు పోయే  ప్రమాదం ఉందని , గతం లో పసర పరిధిలో ఇటువంటి ఘటనలు జరిగిన దృశ్య  రైతులు పంట రక్షణ కొరకు తమ పొలాల వద్ద కరెంట్ తీగలు పెట్టకూడదు అని , దీని కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేసారు. ఇక మీదట ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైన కరెంటు వైర్లు,ఉచ్చులు పెట్టినచో పస్ర పోలిక్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని అన్నారు.