తొర్తిలో గ్రామసభ రసాభాసాగా కొనసాగింది.పథకాలకు తాము అర్హులుగా ఉన్నాగాని,తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో కొందరు గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు.తమ పేర్లు జాబితాలో ఎలా రావని, తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎస్సై రాము వారి పోలిస్ బృందంతో అక్కడికి చేరుకుని,ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యక్తులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివ చరణ్,ఏఓ వైష్ణవ్,గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.