నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూరు గ్రామ శివారు క్షత్రియ పాఠశాల, యందు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను గురువారం ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నేతాజి చిత్ర పటానికి పుష్పాంజలి గావించి నివాళులర్పించారు. ఈ సందంర్భంగా నిర్వహించబడిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ స్వామి మాట్లాడుతూ నేతాజి గొప్ప పోరాట యోధుడని, విభిన్న మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్య్రం సంపాదించాలని అనుకున్నాడని. అందుకై I.N.A (ఇండియన్ నేషనల్ ఆర్మీ)ని స్థాపించి బ్రిటిషువారితో పోరాటం చేసినాడని అన్నారు. యువతలో దేశభక్తిని మేలుకొల్పి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేటట్లు చేసినాడని ప్రిన్సిపల్ అన్నారు. క్షత్రియ – విద్యా సంస్థల ఆధిపతి శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ తన సందేశాన్ని పంపుతూ నేతాజి మంచి విద్యాధికుడని, గొప్ప దేశభక్తుడని, బ్రిటిష్ వారితో పోరాటం చేసి వారిని ఓడించి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టాలని భావించి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీతో పోరాటం చేసినాడని పేర్కొన్నారు . 48 సంవత్సరాల వయస్సులో విమాన ప్రమాదంలో మరణించడం మన దురదృష్టమని అన్నారు. విద్యార్థులు నేతాజీని ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో పయనించి దేశానికి మంచి పేరు తీసుకరావలని ఆకాంక్షించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్చంది విద్యార్థులు పాల్గొనారు.