ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్న చిత్రాలు

Films Competing for Oscarsసినీ వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా ఆస్కార్‌ని భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆస్కార్స్‌ 2025’ అవార్డుల కోసం పోటీ పడుతున్న ఉత్తమ చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గురువారం 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను విడుదల చేసింది. ‘అనోరా’, ‘ది బ్రూటలిస్ట్‌’, ‘ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌’, ‘కాన్‌క్లేవ్‌’, ‘డ్యూన్‌: పార్ట్‌ 2’, ‘ఎమిలియా పెరెజ్‌’, ‘ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌’, ‘నికెల్‌ బార్సు’, ‘ది సబ్‌స్టాన్స్‌’, ‘విక్డ్‌’ చిత్రాలు ఆస్కార్‌ బరికి అర్హత సాధించాయి.