వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై, విశేష ప్రేక్షకాదరణతో రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పొంగల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ బాక్సాఫీస్ సంభవం పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ, ”’సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ అనేది వండర్ ఫుల్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతికి హానెస్ట్‌గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఆడియన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్‌బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’ అని అన్నారు. ‘మా సినిమాని ఇంతమంది చూసి అప్రిషియేట్ చేయడం, రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించనిదాని కంటే అద్భుతంగా రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫ్యామిలీ సినిమాలకి ఉన్న స్ట్రెంత్‌ని ఈ సినిమా మరోసారి నిరూపించింది’ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ, ‘దర్శకుడు అనిల్ ఓ లైబ్రెరీ. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా చిన్న, చిన్న పదాలని ఎంత అందంగా పట్టుకోవచ్చో తెలుసుకున్నాను. ఈ సినిమా నాకు ఓ అమ్మలాంటి జ్ఞాపకం. ఈ సినిమాతో ప్రతి గడపకు వెళ్ళగలిగాను. ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు’ అని తెలిపారు.