వివేకానంద జయంతి ముగింపు ఉత్సవాల్లో అవార్డులు ప్రధానం..

Vivekananda Jayanti's concluding celebrations will feature awards.నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా చేసిన మహోన్నత వ్యక్తి ,శక్తి స్వామి వివేకానంద అని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యపడేది యవ్వనంలోనే అని…. యువత తమ శక్తి యుక్తులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని దేశ ఐక్యతకు కృషి చేయాలన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ మాట్లాడుతూ వివేకానంద తన  ప్రసంగాల ద్వారా ప్రపంచ దేశాలలో భారతదేశానికి మంచి గుర్తింపు, గౌరవం  తెచ్చిన గొప్ప వ్యక్తి వివాకానంద అని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ భాషా మరియు సంస్కృతిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలచారి మాట్లాడుతూ అపజయాలకు యువత లొంగిపోవద్దని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జాతీయ పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి మండలి సలహాదారులు డాక్టర్ లయన్ .కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సమర్పన్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్చంద్ జైన్, తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, కార్యదర్శి శ్రీమతి ఇట్టా ఉదయశ్రీ రెడ్డి, డాక్టర్ రవితేజ, కుమారి వచన ప్రియా పాటిల్, బత్తుల హేమంత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అంతకుముందు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్ లక్ష్మణ్ నాయక్ ,డాక్టర్ జె అచ్యుతా రెడ్డి దేవి, డాక్టర్ సారహ నహీద్, తయ్యబా తసీన్ డాక్టర్ డి సరిత, డాక్టర్ కటకం భాస్కర్, ఎడ్ల నారాయణ, ఏ రాంబాబు, సావిత్రి, సుబేదార్ మణి కిషన్ ముదిరాజ్, శృతికాంత్ భారతి, జి నవీన్ కుమార్, శ్రీ చంద్రశేఖర్ చంద్రముఖి,  భద్రమోని నరేందర్, సరిత నాయుడు లకు జాతీయ ఐక్యత అవార్డు 2025 ను శాలువా పూలమాల జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అవార్డు ప్రదానం చేశారు ముఖ్య అతిథి ప్రొఫెసర్ కుమార్ .దివ్య సల్లాసింగ్ శ్రీ దొండల మహేష్,తేలు పవన్ కుమార్, గోగికల్ బాలాజీ సూర్య వంశీ,ఇందుగవల్లి సూరిబాబు, తేల్ సుధారాణి లకు జాతీయ యువజన అవార్డు శాలువా పూలమాల జ్ఞాపకతో ముఖ్య అతిథి సన్మానించి అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయ, రాజ్ బహదూర్ వెంకట్రాంరెడ్డి మహిళా కళాశాల ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాల, బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ,జాగృతి మరియు బిజేఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సంస్కృతి కార్యక్రమాలను ప్రదర్శించారు.