మతిస్థిమితం లేని వ్యక్తి మృతి..

Insane person diesనవతెలంగాణ – పెద్దవూర
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలం లోని నీమానాయక్ తండా పంచాయతీ లోని బెట్టేల తండా సమీపంలోని సమ్మక్క సారక్క, పొట్టిచేలిమ వద్ద సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం బెట్టేలతండా సమీపంలో ఓ మతి స్థిమితం లేని వ్యక్తి గత కొద్దిరోజులుగా తిరుగుతూఉన్నాడు. అతనికి బట్టలు లేకుండా ఉండడంతో గ్రామస్తులు బట్టలు ఇచ్చిన వాటిని చింపివేసి మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. శుక్రవారం ఉదయం పొట్టి చలమ దగ్గర అడవి ప్రాంతంలో హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్ హైవే రోడ్డు పక్కన కొంత దూరంలో ఆహారం లేక చలి తీవ్రత వలన తట్టుకోలేక చనిపోయి పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని మృత దేహాన్ని నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లోని మార్చురి గదికి తరలించడం జరిగిందని తెలిపారు.ఎవరైనా ఇతని శవాన్ని గుర్తుపట్టినట్లయితే అట్టి విషయాన్ని ఎస్సై పెద్దవూర- 8712670198- స్టేషన్ రైటర్ కిషన్ నాయక్ -9700125494, సీఐ నాగార్జునసాగర్ 8712670153 లకు తెలియజేయగలరని తెలిపారు.