నవతెలంగా – పెద్దవూర
పెద్దవూర మండలంలో 26 గ్రామ పంచాయతీలలో శుక్రవారం చివరి రోజు పెద్దవూర, చలకుర్తి, కోమటి కుంట తాండ, ఉట్లపల్లి, తాండ, గేమ్యా నాయక్ తాండ, పులిచర్ల పంచాయతీ లలో గ్రామసభలు ప్రశాంతంగా నిర్వహించారు. ఈ గ్రామ సభలో లో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాలపై గ్రామ సభలలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోతహసీల్దార్ సరోజ పావని ఎంపీడీఓ సుధీర్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఏఈ దీక్షిత్ కుమార్, సూపరిండెంట్ హఫీజ్ ఖాన్, ఏఓ సందీప్ కుమార్, ఏఎంఆర్పీ ఏఈఈ మల్లయ్య,కార్యదర్శి కార్తీక్ రెడ్డీ,రవీందర్ రెడ్డీ,శ్యామ్ సుందర్ రెడ్డీ,మాజీ సర్పంచులు అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.