తపాలా సేవలను విస్తృత పరచాలి..

Postal services should be expanded.– ప్రతి ఒక్కరికి తపాల ఖాతా ఉండేలా చూడాలి: ఎస్పీ వీరభద్ర స్వామి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రతి ఒక్కరికి తపాల ఖాతా ఉండేవిధంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు కృషి చేయాలని ఎస్.పీ వీర భద్ర స్వామీ సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట గ్రామీణ తపాలా ఉద్యోగులు, సిబ్బంది తో అశ్వారావుపేట ఎస్ఓలో శుక్రవారం జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ..  తపాల సిబ్బంది అధిక సంఖ్యలో పొదుపు ఖాతాలు ప్రారంభించాలని చెప్పారు. ప్రమాద బీమా పథకాలు వివరించాలని అన్నారు. తపాలా శాఖ ద్వారా అందిస్తున్న పొదుపు పథకాలు గురించి గ్రామాల్లో అవగాహనా కల్పించాలని కోరారు. ఎస్.పి.ఎం సాయి ప్రభ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాల్వంచ ఐ.పి.ఓ వీరన్న, మెయిల్ ఓవర్సీస్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.