
జాతీయ రహదారి భద్రత మాసోత్సవలో భాగంగా కామారెడ్డి ఆర్టీసీ డిపోలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యగా ఉండాలి అని ఎటువంటి ఒత్తిడి,అలజడి కి లోనవ్వకుండా బస్సు నడపాలి అని ఆర్ టి సి డిపో నందు రహదారి భద్రత అవగహన సదస్సులో భాగంగా డ్రైవర్స్ ని ఉద్దేశించి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జె. శ్రీనివాస్ ప్రాసంగించారు. అత్యుత్తమ డ్రైవర్స్ ని, మెకానిక్స్ ను సత్కరించారు. ఈ అవగాహనా సదస్సు లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి తిరిగి డిపో కి చేరుకొని ఉచిత కంటి పరీక్షలు, రక్తదాన శిబిరలలో పదుల సంఖ్యలో కార్మికులు పాల్గొని కార్యక్రమంన్ని దిగ్విజయం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ టి సి డిపో మేనేజర్ ఇందిర, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఆర్. నాగలక్ష్మి పాల్గొన్నారు.