డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు శిక్ష..

Three jailed for drunk and drivingనవతెలంగాణ – ఆర్మూర్
మద్యం తాగి వాహనము నడిపిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ తీర్పు ఇచ్చినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. పోలీసు స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన మాసం మహేష్, మారట నగేష్, బాలాజీ ముగ్గురు పట్టుబడ్డారు. సదరు వ్యక్తులని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుచుగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విదిస్తు తీర్పు వెల్లడించారు.